ఖమ్మం నగరంలోని మమత రోడ్డుకు వెళ్లే దారిలో, అబ్దుల్ కలాం రోడ్డు నంబర్ 1 వద్ద రోడ్డు నిర్మాణం సగానికే నిలిచిపోయింది. రోడ్డు చివర భాగం దిగువగా ఉండటంతో వాహనాలు ఎక్కే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. కార్లు వెళ్లడం కూడా కష్టతరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KDP: వైవీయూ డిగ్రీ 3, 4, 5వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ బుధవారం విడుదల చేశారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల్లో 3వ సెమిస్టర్‌లో 62.39%, 4వ సెమిస్టర్‌లో 81.58%, 5వ సెమిస్టర్‌లో 77.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పద్మ, కృష్ణారావు పాల్గొన్నారు.
PLD: నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో ఆర్‌డీఎస్‌ఎస్ (RDSS) పథకం కింద విద్యుత్ లైన్లను సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్‌గా మార్చే పనులు చేపట్టారు. పాత పోల్స్, కండక్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు. ఈ పనుల వల్ల నేటి నుంచి 20 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
GNTR: జీఎంసీకి పన్ను బకాయిలు చెల్లించని ప్రధాన డిఫాల్టర్లకు వెంటనే ‘రెడ్ నోటీసులు’ జారీ చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షలో పన్ను వసూళ్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఐల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి, గతేడాది కంటే 30 శాతం అధికంగా వసూళ్లు సాధించాలని ఆయన స్పష్టం చేశారు.
NDL: ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీని బుధవారం మంత్రి బీసీ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇంతమంది నిర్వాసితులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు. సొంతిళ్లు, స్వగ్రామాలను ఖాళీ చేసిన ప్రజల త్యాగం మరువలేనిదన్నారు. పోర్టును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తునట్లు చెప్పారు.
GNTR: తెనాలి రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రేపల్లె మండలం నల్లూరివారిపాలెంకు చెందిన యలవర్తి సుబ్బారావు (70) రెండో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద టిఫిన్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
HNK: ప్రతీ విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మడికొండ శ్రీనివాస్ అన్నారు. పరకాల పట్టణంలోని విద్యాలయ పాఠశాలను వారు సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఏకాగ్రతతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, చదువు మన తలరాతను మారుస్తుందన్నారు. కార్యక్రమంలో సంపత్ కుమార్ ఉన్నారు.
1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం1917: సినీ నటి కాంచనమాల జననం1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం1958: సినీ నటుడు నాజర్ జననం1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం1985: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ జననం1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం
AP: వేట్లపాలెం ఘటనలో 26 మంది చనిపోవడం బాధాకరమని CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌కు YCP హయాంలో అనుమతి ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. పరిమితికి మించి మందుగుండు నిల్వ చేశారని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులకు ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.
➠ తిథి: బహుళ విదియ సా.4:43 వరకు తదుపరి తదియ ➠ నక్షత్రం: ఉత్తర ఉ.8:13 వరకు, తదుపరి హస్త ➠ శుభ సమయాలు: ఉ.6.17-7.15, ఉ.9:13-10:10, ఉ.10:59-మ.12:09, మ.1:07-2:06, సా.4:04-4:59 వరకు ➠ రాహుకాలం: మ.1:30-3 గంటల వరకు ➠ యమగండం: ఉ.6-7:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.10:11-10:58, మ.2:53-3:40 వరకు ➠ వర్జ్యం: సా.5-రా.6:40 వరకు ➠ అమృత ఘడియలు: తె.3:02 నుంచి 4:42 వరకు
గల్ఫ్ లాటరీలో ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. అబుధాబీలో నిర్వహించిన బిగ్ టికెట్‌లో షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాల్ 15 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు రూ.37.5 కోట్లు) గెలుచుకున్నారు. FEB 28న ఆయన టికెట్ కొన్నట్లు సమాచారం. మార్చి 3న డ్రా తీయాల్సీ ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు ఇవాళ డ్రా తీసి విజేతలను ప్రకటించారు.
TG: పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయని నాంపల్లి బోర్డు అధికారులు వెల్లడించారు. 2,676 కేంద్రాల్లో 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్), సైన్స్ మినహా పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లు వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉండగా, నాంపల్లిలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
TG: అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి భవన పునర్నిర్మాణం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఈనెల 8న ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మండలిలోని కొత్త హాల్‌ను ప్రారంభించనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్ నిర్మాణం జరుగుతుందని, దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు.
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ వాల్యూమ్‌తో మ్యూజిక్ వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. వినికిడి నష్టం కలగకుండా ఉండాలంటే హెడ్ ఫోన్ వంటి వ్యక్తిగత ఆడియో పరికరాలను 60 శాతం కంటే తక్కువ శబ్ధంతో ఉపయోగించాలి. అలాగే, ఒక గంట ఉపయోగించిన తర్వాత విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. యువత అధిక శబ్ధంతో సంగీతం వింటూ ఉంటారు. దీని వల్ల వినికిడి నష్టం ఎక్కువగా ఉంటుంది.