• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ట్రాక్టర్, బోలెరో ఢీ.. పలువురికి గాయాలు

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 44 హైవేపై బుధవారం అర్ధరాత్రి కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 5, 2026 / 08:20 AM IST

తెలంగాణ వర్సిటీలో ఉద్రిక్తత.. జూనియర్లపై దాడి!

KMR: తెలంగాణ వర్సిటీలో సౌత్ క్యాంపస్‌లో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు జూనియర్లపై దాడికి దిగడంతో ఓ విద్యార్థికి గాయమైంది. దీంతో ఆగ్రహించిన జూనియర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, వార్డెన్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

March 5, 2026 / 08:19 AM IST

ఒంగోలు కూటమిలో రాజకీయ రగడ

ప్రకాశం: ఒంగోలు కూటమిలో కుంపటి రాజుకుంటుందా అనే సందేహం ప్రజల్లో మొదలైంది. YCP నుంచి బాలినేని జనసేనలోకి వెళ్లగా.. అప్పటి నుంచి ఆయనపై అవాకులు, చవాకులు పేలుతూనే ఉన్నాయి. MLA దామచర్ల కూటమిలో ఉండగా.. వాస్తవానికి వీరిద్దరు కూటమిలో ఉన్నా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

March 5, 2026 / 08:18 AM IST

ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను సాధించాలి: కలెక్టర్

PDPL: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం ఆయన పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 సంవత్సరం ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆధారిత కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 5, 2026 / 08:18 AM IST

పనులు మొత్తం చెల్లించాల్సిందే: కమిషనర్

WGL: పట్టణంలో కార్పొరేషన్‌కు సంబంధించిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాల్సిందేనని నగర కమిషనర్ చావత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్పొరేషన్‌కు పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఇతర బకాయిల చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలను కోరారు.

March 5, 2026 / 08:17 AM IST

పింఛన్ల పెంపు ఇంకెన్నోడో?

SDPT: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపు అమలు కాకపోవడంపై లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 ఇస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు ఈ పెంపు ఎప్పుడు అమలవుతుందని ఎదురుచూస్తున్నారు.

March 5, 2026 / 08:16 AM IST

‘ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి’

NRML: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ప్రవాసి మిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల సూచించారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు గల్ఫ్ దేశాలకు వెళ్లకూడదని గురువారం ప్రకటనలు వారు కోరారు.

March 5, 2026 / 08:13 AM IST

ప్రారంభానికి సిద్ధమైన రెండు చెరువులు

HYD: నగరంలో మరో రెండు చెరువులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమృకున్-ఉద్-దౌలా, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6న బమృకున్-ఉద్-దౌలా చెరువును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం తెలిసిందే.

March 5, 2026 / 08:12 AM IST

మార్కెటింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు మార్కెటింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ శైలకుమారి తెలిపారు. చిలుకూరులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 17 నుంచి 3 నెలల పాటు రిటైల్ సేల్స్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, ఈనెల 16త తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

March 5, 2026 / 08:12 AM IST

’99 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి’

VKB: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రణాళిక’ను అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

March 5, 2026 / 08:10 AM IST

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.

March 5, 2026 / 08:10 AM IST

106 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా బామ.. కారణమిదే..!

NDL: నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితమవుతుంటే, పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

March 5, 2026 / 08:10 AM IST

‘పశు వైద్య కేంద్రాల్లో వసతులు కల్పించాలి’

BHNG: గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వెటర్నరీ సబ్ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ జిల్లా అసోసియేషన్ కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం సమర్పించింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సిద్ధగోని వెంకటరమణ, నర్సింహ యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 5, 2026 / 08:10 AM IST

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి

KMM: పెళ్లైన మూడు నెలలకే ఆ ఇంట్లో హోలీ పండుగ తీరని శోకాన్ని నింపింది. ఏన్కూరుకు చెందిన మల్లు సాయి బుధవారం స్నేహితులతో కలిసి హోలీ ఆడుతూ సరదాగా ఈత కోసం కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సాయి మరణంతో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఈ ఘటనపై ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 5, 2026 / 08:09 AM IST

ప్రమాదవశాత్తు మామిడి కొమ్మ పైనపడి వ్యక్తి మృతి

ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జలసూత్రం రంగారావు (57) మామిడి కొమ్మలు కోయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు భారీ కొమ్మ పైనపడి మృత్యువాతపడ్డాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లగా ఈ దుర్గటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 08:08 AM IST