VZM: బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనుల నిమిత్తం ఇవళ ఉదయం 9 నుంచి 5 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు బుధవారం తెలిపారు. ఈ మేరకు రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్దవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
NZB: శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.151 చెల్లించి ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్‌పై అవగాహన కల్పించారు. మార్చి 2 నుంచి తెలంగాణలో ముఖ హాజరు విధానం అమల్లోకి వచ్చిందని జిల్లా కోఆర్డినేటర్ ఎంజి. నరసింహులు తెలిపారు. పని ప్రారంభంలో ఒకసారి, ముగింపులో ఒకసారి ఫోటో తీయించుకుంటేనే హాజరు నమోదవుతుందని.. లేదంటే వేతనాలు జమకావని స్పష్టం చేశారు.
HNK: హనుమకొండ చారిత్రక శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం నుంచి సూర్య భగవానుడికి భక్తులు స్వాగతం తెలిపారు. తెల్లవారుజామున ఆలయ శిఖరం పైభాగం నుంచి భానుడు ఉదయించే దృశ్యాలు కనువిందు చేశాయి. శివపార్వతుల సన్నిధిలో సుప్రభాత వేళ సూర్యుడు దర్శనం చూసి భక్తులు తన్మయం చెందారు. తమ సెల్ ఫోన్లలో వీడియోలు బంధించారు.
VSP: నగరంలో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన ఇంజనీరు పి.వి.సత్యనారాయణ రాజు, తదితర అధికారులతో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
GNTR: పొన్నూరు మండలం మాచవరంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షా కేంద్రాన్ని కూడా ఆయన తనిఖీ చేశారు.
GNTR: పొన్నూరు మండలం మాచవరంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షా కేంద్రాన్ని కూడా ఆయన తనిఖీ చేశారు.
బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్(BPSCL)లో 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు కాగా రిజర్వేషన్ బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.50,000-1,60,000 వరకు జీతం చెల్లిస్తారు. సైట్: bpscl.com
VZM: వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.
WGL: శివనగర్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు రికార్డులను స్వయంగా పరిశీలించిన ఆమె, భోజన నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించి.. మెనూ ప్రకారం సమయానికి భోజనం, స్నాక్స్ అందుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కర్నూలు జిల్లా మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం బ్యాడిగ మిర్చి క్వింటా రూ.38,508 గరిష్ఠ ధర పలికింది. ఈ సీజన్లో ఇదే రికార్డు ధర కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సూపర్-10 రకం రూ.21,600, మిర్చి-5 రకం రూ.21,229, దేవనూరు డీలక్స్ రకం రూ.20,199, తేజ రకం రూ. 19,600కు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు.
E.G: రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 8కి చేరింది. తాజాగా సూర్య కుమారి అనే మహిళ మృతి చెందగా, మృతుల్లో ఆరేళ్ల బాలుడు సహా ఏడుగురు వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్యులు వేక్షిస్తున్నప్పటికీ బాధితుల పరిస్థితిలో మార్పు రాలేదు.
అన్నమయ్య: రామాపురం మండలం నీలకంఠరావుపేట పంచాయతీ శ్రీసాయినగర్ మంగళవారం రాత్రి దర్గా ఉరుసులో ఎస్సై శివకుమార్ పలువురు వైసీపీ నేతలు గొడవపడ్డ విషయం తెలిసిందే. నల్లగుట్ట పల్లె సర్పంచి నాగభూషణ్ రెడ్డి కుమారుడు పవన్ ఎస్సై కాలర్ పట్టుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో గొడవకు కారణమైన 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్సై తెలిపారు.
TPT: కొంకావీధిలోని తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ కేర్ సెంటర్‌లో గురువారం నుంచి మూడు రోజులపాటు ఉచితంగా వినికిడి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆడియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునాతనమైన హియరింగ్ ఎయిడ్స్‌ను ప్రత్యేక తగ్గింపు ధరలతో అందిస్తున్నామన్నారు. వివరాలకు 9849085342 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ బృందం సభ్యురాలు నేరేళ్ల పద్మశ్రీ తెలిపారు. 500 మందితో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి దంపతులు పాల్గొంటారని తెలియజేశారు.