ASF: నిరంతరం విద్యుత్ సరఫరా అందేలా చూస్తూ,ప్రాణాలకు తెగించి పనిచేసే లైన్‌మెన్ల పట్ల కృతజ్ఞత తెలపడమే “నేషనల్ లైన్‌మెన్ డే” ముఖ్య ఉద్దేశ్యమని బెజ్జుర్ AE అంజల్ కుమార్ అన్నారు. బుధవారం ఉత్తమ సేవలు అందించిన లైన్‌మెన్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రాణాలను పణంగా పెట్టే వారి పట్ల గౌరవంగా ఉండటం, విద్యుత్ వృథా చేయకుండా ఉండడమే వారికి ఇచ్చే కృతజ్ఞత అన్నారు.
SDPT: కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యా లయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె. బగారా అన్నం రుచికరంగా లేకపోవడం, కూరలు పల్చగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
MBNR: నాయీబ్రాహ్మణులు విద్యా, వైద్య, రాజకీయ రంగాల్లో రాణించాలని నాయీ మిత్రమండలి జాతీయ కన్వీనర్ అశ్విని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 36వ డివిజన్ కార్పొరేటర్ సదుర్ల శేఖర్ విజయం సాధించిన సందర్భంగా నాయీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.
శ్రీకాకుళం నగరంలో డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లోకి తెచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇంచార్జి కమీషనర్‌గా జేసీ వ్యవహరిస్తున్నారు. సస్పెండ్ అయిన కమీషనర్‌కి ‘సమర్థుడు’ అనే ఇమేజ్, అన్యాయంగా ‘బలి పశువును’ చేశారనే సానుభూతి, కూటమి నేతల సపోర్ట్ ఉన్నాయి.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మపుష్కరిణిలో ఉగ్రనరసింహస్వామి ఉత్సవమూర్తులను కోనేరుకు తీసుకువచ్చారు. ఆలయ అర్చక సిబ్బందిహంసవాహనంపై ఆశీనులను గావించి పుష్కరిణిలో ఐదు ప్రదక్షిణలు చేయిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పుష్కరిణి మండపంలో డోలోత్సవం నిర్వహించారు.
SRPT: మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం, కృష్ణానగర్ గ్రామాల మద్య రామాపురం గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీలక్ష్మి నర్సింహ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం బుధవారం మండల పరిధిలోని బరాఖాత్ గూడెం గ్రామంలో స్వామి వార్లను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు బేతం రామిరెడ్డి, చల్లా గురవయ్య,వెంకటేశ్వర్లు, భక్తులు పాల్గొన్నారు.
E.G: మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కలెక్టర్ కీర్తి చేకూరికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పోలీసు ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అనంతరం ఎస్పీని కలిసి హైకోర్టు ఉత్తర్వులతోపాటు వినతి పత్రాన్ని అందజేశారు.
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌లో సయ్యద్ సద్దాం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామరస్యం పెంపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్యపాత్ర వహిస్తాయని, రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
కోనసీమ: జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న రామచంద్రపురం టౌన్ హాల్‌లో మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన 18-28 వయసు గల మహిళా అభ్యర్థులు హాజరు కావాలన్నారు. పదవ తరగతి కనీస అర్హతతో 50 సంవత్సరాల లోపు మహిళలు సైతం హాజరుకావచ్చన్నారు.
SRPT: అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ శివారులోని ఓ కోళ్ల ఫామ్‌లో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. అస్సాంకు చెందిన జలాలుద్దీన్ అనే కార్మికుడు షెడ్ శుభ్రం చేస్తుండగా, మోటర్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. రాయదుర్గం మండలం ఉడేగోళం పాఠశాలలో మంజూరైన వంటగది, మరుగుదొడ్ల నిర్మాణాలు బిల్లులు రాక ఆగిపోయాయి. ఫలితంగా విద్యార్థులు బయట కాలకృత్యాలకు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండేందుకు వంటగది లేకపోవడంతో ఆరుబయట వంట చేస్తున్నారు.
KKD: పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీధర్ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్డీవో శ్రీరమణిని వేట్లపాలెం ఘటనకు సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. కలెక్టర్ ఎస్.ఎస్ మోహన్ ఆదేశాల మేరకు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. ఆర్డీవో కార్యాలయ సిబ్బంది శ్రీధర్‌కు స్వాగతం పలికారు.
BPT: ఇంకొల్లులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు బుధవారం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆమె మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాధారమని, దాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
W.G. ఆటోలో బంగారు ఆభరణాల చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే భీమవరం పట్టణంలో ఇటీవల జరిగిన ఒక దొంగతనం కేసును భీమవరం వన్ టౌన్ పోలీసులు అత్యంత సమర్థవంతంగా దర్యాప్తు చేసి, ఫిర్యాదు అందిన కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు.
PDPL: తీర్థయాత్రల కోసం గోదావరిఖని ఆర్టీసీ డిపో ద్వారా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినట్టు డిపో మేనేజర్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు అరుణాచలం, రామేశ్వరం, శ్రీరంగం తదితర తీర్థయాత్రల కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. 21న మైహర్ (శక్తి పీఠం), వారణాసి, అయోధ్య తీర్థయాత్రలకు బస్సు ఏర్పాటు చేశామన్నారు.