AP: లడ్డూ కల్తీకి పాల్పడిన YCP సభకు క్షమాపణలు చెప్పాలని TDP MLC అనురాధ డిమాండ్ చేశారు. YS నుంచి జగన్ వరకూ శ్రీవారిపై పగ పట్టారు.. కక్ష గట్టారు. శ్రీవారి లడ్డూపై జగన్ విషం చిమ్మారు. రసాయనాలు, మోనోగ్లిజరైడ్స్‌తో లడ్డూలు తయారు చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారు. నెయ్యి కల్తీ చేయడానికి అనుకూలంగా వ్యవస్థలను మార్చారు’ అని విమర్శించారు.
VZM: జిల్లాలో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మి బుధవారం జిల్లా కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు.
SRCL: సిరిసిల్ల వేములవాడ పట్టణాలలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు జిల్లా ఎస్పీ మహేష్ గితేకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల, పుణ్యక్షేత్రమైన వేములవాడలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందన్నారు. దీంతో అధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.
NDL: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు పెద్ద అండగా ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసులకు మంజూరైన రూ.1,44,562 చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
PPM: గిరిజనులు సాగు చేసిన కొండచీపురుల రవాణాలో అటవీశాఖ అధికారులు 10వేల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు ఆరోపించారు. వబ్బంగి పంచాయతీ తోలుంగూడ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనుల వాహనాన్ని చినబగ్గ కాలనీ వద్ద అడ్డగించి డబ్బు తీసుకున్న ఘటనను ఖండించారు.
BDK: గుండాల బతుకమ్మ ఘాట్ అభివృద్ధి, ఊర చెరువుపై మినీ ట్యాంక్ బండ్, లైటింగ్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇరిగేషన్ డీఈ వెంకటేష్, ఏఈ పృథ్వి ఊర చెరువు కట్టను, బతుకమ్మ ఘాట్‌ను సర్వే చేశారు. మినీ ట్యాంక్ బండ్, లైటింగ్ నిర్మాణం, బతుకమ్మ ఘాట్‌ను అభివృద్ధి చేసి ఆహ్లాదకర వాతావరణం అందిస్తామని వారు తెలిపారు.
MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు గాను రూ. 111 కోట్లు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన పనులు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన సామల ఎర్రయ్య (56) కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా కాలు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
VSP: గాజువాకలోని మంగళగిరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్ఐసి కార్యాలయాన్ని జీవీఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. జీవీఎంసీకి పన్ను రూపంలో రూ.7.87 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉండగా నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో ఏడీసీ రమణమూర్తి, జోనల్ కమిషనర్ శేషాద్రి ఆర్వో రామనారాయణ సమక్షంలో కార్యాలయాన్ని సీట్ చేశారు.
AKP: నర్సీపట్నం నియోజకవర్గంలో టమాటా పండించే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు టమాటా పంటకు అధిక ధర వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రైతులు ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు.
ATP: పామిడిలోని సత్యసాయి తాగునీటి శుద్ది కేంద్రాన్ని బుధవారం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణ, గుత్తి మున్సిపల్ డీఈఈ హేమచంద్ర పరిశీలించారు. రానున్న వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం తాగునీటి శుద్ధి కేంద్రంలోని మోటార్ల పనితీరును పరిశీలించారు.
ASR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించారు. సీఎం డ్యాష్ బోర్డు ద్వారా అందిన అప్లికేషన్లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించాలన్నారు.
SRPT: గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచుల శిక్షణలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
MDK: జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు,మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలి అన్నారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణ శివారులోని గోదావరి నది తీరంలో జరిగే పుష్కరాల కోసం ప్రతిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని స్థానిక MRO దిలీప్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ లతో కలిసి గోదావరి తీర ప్రాంతాన్ని సందర్శించారు. పుష్కరాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిపారు.