• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి’

VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు వెల్ఫేర్ ఆంగ్ల పాఠశాల విద్యార్థినులకు స్వీయ రక్షణ మెళుకువలు బుధవారం నేర్పించారు. ఈ కార్యక్రమానికి ASP సౌమ్య లత హాజరై మాట్లాడారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో స్వశక్తితోనే తమను తాము రక్షించుకోవాలని సూచించారు. ఈవ్ టీజింగ్, వేధింపులను ఎదుర్కొనే విధానాలు వివరించారు.

March 4, 2026 / 06:49 PM IST

‘ఉస్తాద్’ కోసం చేతులు కలిపిన DSP – తమన్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ కేవలం పాటలకే పరిమితం కానుండగా, BGM తమన్ అందించబోతున్నాడు. ఈ మేరకు మేకర్స్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు ఒకే సినిమా కోసం పనిచేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.

March 4, 2026 / 06:49 PM IST

‘చేయూత’ పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన నేతలు

WGL: నెక్కొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం ఇందిరాగాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చేయూత’ పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు గత సర్పంచ్ ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. సర్పంచ్ హరిప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

March 4, 2026 / 06:48 PM IST

శ్రీసిటీలో భద్రతా వారోత్సవాల ముగింపు

TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. పరిశ్రమల సిబ్బంది, ఉద్యోగులు, సమీప పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ సతీష్ కామత్ భద్రతా జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి భద్రతా ప్రమాణాల పాటింపు అత్యవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

March 4, 2026 / 06:47 PM IST

‘అటవీ ఆధారిత ద్రావణాల ప్రాముఖ్యత ఎంతో ఉంది’

ASR: హుకుంపేట మండలం బోడిగట్టులో బుధవారం రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న అటవీ చైతన్య ద్రావణం ప్రయోగ క్షేత్రం పరిశీలించారు. ఈ ద్రావణం వినియోగంతో పంటల పెరుగుదల, నేల సారవంతం, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. సహజ వ్యవసాయ పద్ధతుల్లో అటవీ ఆధారిత ద్రావణాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.

March 4, 2026 / 06:47 PM IST

గత ప్రభుత్వంలో ఒక్క DSC నిర్వహించలేదు: CM

AP: గత ప్రభుత్వంలో ఒక్క DSC నిర్వహించలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రీయల్ పార్క్‌లు ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటివరకు 6,28,327 మందికి ఉద్యోగాలిచ్చాం’ అని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 06:47 PM IST

చింతకానిలో ఘోర ప్రమాదం.. మైనర్ డ్రైవర్ మృతి

KMM: చింతకాని మండలం నాగులవంచ సమీపంలో మార్చి 1న జరిగిన రెండు ట్రాక్టర్ల ప్రమాదంలో ఓ యువ డ్రైవర్ దుర్మరణం చెందారు. మృతుడి వయస్సు ఆధార్ ప్రకారం 19 ఏళ్లని తల్లి పేర్కొన్నప్పటికీ, SSC మెమో ఆధారంగా అతను 16 ఏళ్ల మైనర్ అని పోలీసుల విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా మైనర్‌కు వాహనాన్ని అప్పగించినందుకు గానూ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 4, 2026 / 06:45 PM IST

మంత్రిని కలిసిన మున్సిపల్ ఛైర్మన్

NRML: పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ కావ్య, వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తిలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లికి విన్నవించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధితో పాటు శ్యామఘడ్, బత్తిస్ ఘడ్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

March 4, 2026 / 06:45 PM IST

ముమ్మరంగా వాహన తనిఖీలు

AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం చీడిగుమ్మల వద్ద బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అప్పారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

March 4, 2026 / 06:44 PM IST

బాల్య వివాహాలు చట్టరీత్య నేరం ఎస్సై సూర్య భగవాన్

ELR: అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఉంగుటూరు హైస్కూల్‌లో ICDS ఆధ్వర్యంలో బుధవారం కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అన్నారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ శారద, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు.

March 4, 2026 / 06:44 PM IST

ఎండలు మండుతున్నాయ్!

AP: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండగా.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి.

March 4, 2026 / 06:42 PM IST

SA vs NZ: ప్లేయింగ్-11

NZ: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్SA: మార్‌క్రమ్(c), డికాక్(w), రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి

March 4, 2026 / 06:42 PM IST

జిల్లాలో ముగిసిన LLB పరీక్షలు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో LLB 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థులకు 1,825 మంది హాజరు కాగా 108 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:40 PM IST

వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని బుధవారం దర్శించుకున్నారు. నూతన పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వీర ధర్మజ వెంకటాద్రి స్వామిని, ఆయన సోదరుడు దత్తాత్రేయ స్వామిని ఘనంగా సన్మానించారు. పీఠాధిపతి హయాంలో మఠం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

March 4, 2026 / 06:40 PM IST

ప్రమాదబీమా పథకం కింద 231 క్లెయిమ్స్ పరిష్కారం: మంత్రి

MLG: ప్రమాదబీమా పథకం కింద ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పథకం అమల్లోకి వచ్చిన 2024 నుంచి ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కరించి, మొత్తం రూ.23.1 కోట్లు లబ్దిదారుల కుటుంబాలకు అందించినట్టు మంత్రి చెప్పారు. ఆర్థికంగా కుంగిపోకుండా ఈ పథకం పెద్ద ఊరటనిస్తుందన్నారు.

March 4, 2026 / 06:40 PM IST