CTR: తుమ్మిందపాళ్యంలో ఇవాళ ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు. ఢిల్లీ బాబు వద్ద సాయికుమార్ రూ. 2 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. అప్పు ఇవ్వలేదని అడిగే క్రమంలో ఏర్పడిన గొడవలో ఢిల్లీ బాబు సాయికుమార్‌ను నాటు తుపాకితో కాల్చాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతులు సాగుచేస్తున్న వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు రావాలంటే సస్యరక్షణ, ఎరువుల యాజమాన్య పద్దతులు పాటించాలని రాగోల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ్‌బాబు అన్నారు. కోటబొమ్మాలి మండలం చిట్టేవలస, తిలారు గ్రామాల్లోని రైతులకు వేరుశెనగ పంటపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఏడీఏ కె. జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.
VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి కోసం యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారుతోందని ఆయన పేర్కొన్నారు.
NLR: రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం గుడ్లూరు మండలం కర్లపాలెంలో R&R కాలనీ నిర్మించారు. దీనిని మంత్రి BC జనార్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.40 కోట్లతో ఈ కాలనీ నిర్మాణం జరిగింది. పోర్టు నిర్వాసితులకు ఈ కాలనీలో పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, MLA ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.
SRPT: ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అధికారి దయానంద రాణి తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 31లోగా ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9848503644 నంబరును సంప్రదించవచ్చనీ అన్నారు.
కడప నగరంలోని డీఎల్టీసీ కాలేజీలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్ర ఆధ్వర్యంలో కల్తీ పాలు, ఆహార పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూరియా, డిటర్జెంట్ వంటి రసాయనాలతో పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీపై సమాచారం ఉంటే 08645-2410295, 9440379755 నంబర్లకు తెలియజేయాలని అధికారులు కోరారు.
NZB: నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌కు బుధవారం గ్రామ సర్పంచ్ బండి చిన్నయ్య, బీజేపి నాయకులు రాయికంటి భరత్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు చేసినందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
PDPL: జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కెనాల్ డి 83, డి 86 కాలువలకు 5వ విడత నీటి విడుదల ఈనెల 1న ప్రారంభమైందని జిల్లా ఇరిగేషన్ అధికారి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 9 వరకు 8 రోజులపాటు నీటి విడుదల జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు నీటిని అందించేందుకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, రైతులు వారికి సహకరించాలని కోరారు.
AP: ఎవరూ ఊహించని విధంగా విశాఖకు భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘వైసీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారు. విద్యాశాఖలో మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తెస్తున్నాం. మేం వచ్చాక 30,598 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సంజీవని ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తెస్తున్నాం’ అని వెల్లడించారు.
JN: స్టేషన్ ఘనపూర్‌లో సీఐటీయు నేతలు బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు హాజరై మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ నిధుల నుండే జిపి సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు.
VKB: పాంబండ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ప్రాచీన చరిత్ర గల పాంబండ దేవాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలనర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, కోట్ల మైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పాండు శర్మ ఉన్నారు.
E.G: రాజమండ్రి క్వారీ ఏరియాలో నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అప్పగించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. బుధవారం గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంలో 1800 గజాల స్థలం, రూ.1 కోటి నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: జిల్లాలో మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శక్తి యాప్, సైబర్ భద్రత, అత్యవసర హెల్ప్‌లైన్‌లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు 112, 1091, 181, 1930 వంటి హెల్ప్‌లైన్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు.
AKP: నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా చేపట్టిన డ్రోన్ తనిఖీలలో సుమారు వందమందికి పైగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని సూచించారు.
RR: ఫరూఖ్ నగర్ మండల శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుకుంటున్న రాజు అనే విద్యార్థి గ్రామ శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి రాజు మృతదేహాన్ని వెలికితీసాయి. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే కుమారుడి ప్రాణం పోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.