MBNR: కౌకుంట్ల మండలం ముచ్చింతల వాగు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు కలకలం సృష్టించారు. స్వామివారి విగ్రహం కాలును ధ్వంసం చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ అపచారానికి ఒడిగట్టిన వారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.