ప్రకాశం: గిద్దలూరు MLA ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం అమరావతిలో CM చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని MLA విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందిస్తూ రోడ్ల అభివృద్ధికి రూ.5.60 కోట్లు విడుదల చేస్తున్నట్లు CM తెలిపారు. ఈ సందర్భంగా MLA సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.