VKB: జిల్లాలోని భూములు, ప్లాట్లు ఇతర విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ. 54.56 కోట్లు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్ లో రూ. 27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్లో రూ. 6.5 కోట్ల ఆదాయం సమకూరింది.