• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు అడ్డుకున్న రైతులు

SRD: న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివారులో నిమ్జ్ ప్రాజెక్ట్ మౌలిక వసతుల కోసం సంబంధిత అధికారులు సరిహద్దు రాళ్ళను గురువారం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, మహిళలు పనులను అడ్డుకున్నారు. పాతిన సరిహద్దు రాళ్లను తొలగించారు. తమకు న్యాయం చేసే వరకు సరిహద్దుల ఏర్పాటుకు అడ్డుకుంటామని తెల్చి చెప్పారు. అధికారులు చేసేదేమీ లేక వెనుతదిరిగారు.

March 5, 2026 / 08:38 PM IST

యెంధాలో పోలీసుల ‘కమ్యూనిటీ కాంటాక్ట్’

ADB: ఉట్నూర్ మండలంలోని యెంధా గ్రామంలో పోలీసులు గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇందరవెల్లి, నార్నూర్ ఎస్సైలు, 18 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10 లీటర్ల గుడుంబా, నంబర్ ప్లేట్లు లేని 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

March 5, 2026 / 08:37 PM IST

వికారాబాద్ జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ దీపక్ తివారి

VKB: జిల్లా జడ్జి చంద్ర కిషోర్‌ను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జరిగిన ఈ భేటీలో కలెక్టరు జడ్జి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చక్కటిపరిపాలన అందించి ప్రజల మెప్పు పొందాలని, దీక్షాదక్షతతో సేవలందించాలని సూచించారు. కలెక్టర్ దీపక్ తివారి జడ్జితో పలు అంశాలపై చర్చించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు.

March 5, 2026 / 08:36 PM IST

ప్రజా పాలన కార్యక్రమంపై అవగాహన

JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయికల్ ఎంపీడీవో చిరంజీవి అన్నారు. మార్చి 6-15 వరకు నిర్వహించనున్న కార్యక్రమంపై అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం అవగాహన కల్పించారు. తహశీల్దార్ నాగార్జున, ఎంపీఓ సుష్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 5, 2026 / 08:36 PM IST

యాదాద్రి శ్రీవారి నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు గురువారం రూ.17,16,620 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.5,71,300, VIP దర్శనాలతో రూ.1,65,000, కార్ పార్కింగ్తో రూ.2,54,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,25,700, ప్రధాన బుకింగ్తో రూ.1,26,900, వ్రతాలు రూ.92,000 కళ్యాణకట్ట రూ.48,500, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.

March 5, 2026 / 08:35 PM IST

స్పోర్ట్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

కామారెడ్డి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించే లక్ష్యంతో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.

March 5, 2026 / 08:35 PM IST

ప్రగతి ప్రణాళిక పై సమావేశం

MDK: మనోహరాబాద్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఎంపీడీవో ప్రీతి రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 6 నుంచి 15 వరకు నిర్వహించే ప్రణాళికలపై చర్చించారు. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో వేరువేరుగా సమావేశం నిర్వహించి ప్రజా పాలన లో ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో సూచించారు.

March 5, 2026 / 08:35 PM IST

‘నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి’

MNCL: అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కోటపల్లి KGBVలో కొనసాగుతున్న అదనపు తరగతి గదులు, భోజనశాల, వంటశాలల నిర్మాణ పనులు, మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.

March 5, 2026 / 08:34 PM IST

మాదిగ ఉద్యోగులు వేలాదిగా హాజరు కావాలి: మంత్రి

KNR: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించడానికి మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు మ.12 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.

March 5, 2026 / 08:34 PM IST

మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలి రావాలి: మంత్రి

KNR: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించడానికి మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేపు మ.12 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.

March 5, 2026 / 08:34 PM IST

కేవీకే శాస్త్రీయ సలహా సంఘం సమావేశం

PPM: కురుపాం మండలం రస్తాకుంటుబాయిలో కృషి విజ్ఞాన కేంద్రంలో 42వ శాస్త్రీయ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. 2025-26లో చేపట్టిన కార్యక్రమాల సమీక్షతో పాటు 2026-27 కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశానికి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పరిశోధనా సంచాలకులు డా. ఏ.అప్పలస్వామి అధ్యక్షత వహించగా, డా.బి.ముకుందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

March 5, 2026 / 08:31 PM IST

సీఎం చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

SRPT: హుజూర్ నగర్ మండల కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం ఆయన పనులను పరిశీలించి, వారం రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారికే పారదర్శకంగా ఇళ్లను కేటాయించాలని అన్నారు.

March 5, 2026 / 08:30 PM IST

​వేం నరేందర్ రెడ్డికి కొర్ర రాంసింగ్ నాయక్ శుభాకాంక్షలు

NLG: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించబడిన వేం నరేందర్ రెడ్డిని దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నరేందర్ రెడ్డి ఎంపిక పట్ల సర్పంచుల ఫోరమ్ హర్షం వ్యక్తం చేసింది.

March 5, 2026 / 08:30 PM IST

ఏలూరులో ఇన్‌ఫ్లుయెన్సర్లతో ఎస్పీ స్పెషల్ మీటింగ్

ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీకు ఉన్న ఫాలోయింగ్ ఒక బాధ్యత అని, దానిని ప్రజల భద్రత, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే మీరు నిజమైన “డిజిటల్ వారియర్స్” అవుతారన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు, బాలికల భద్రత, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

March 5, 2026 / 08:30 PM IST

గీత కార్మికులకు పెన్షన్ అందించాలని వినతి

NZB: దర్పల్లి మండల కేంద్రానికి చెందిన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు గురువారం నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు తమ గౌడ వృత్తి చేసుకునే గీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికీ, పించిన్ అందించే విధంగా చూడాలని కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్‌లకు వినతి పత్రము అందజేశారు.

March 5, 2026 / 08:30 PM IST