AP: మద్యం కుంభకోణంలో ఏ-52 ప్రణయ్‌ను నేపాల్ సరిహద్దులో పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు మార్చి 13 వరకు రిమాండ్ విధించింది. సిండికేట్ బ్రాండ్లను బలవంతంగా అమ్మించి రూ.3.200 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్లు సీఐడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. లంచాలు వసూలు చేసి, షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని వైట్‌గా మార్చి 2024 ఎన్నికలకు నిధులు మళ్లించినట్లు నిర్ధారించింది.
RR: ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోని GMR ఏరినాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య, సాక్షిల వివాహ వేడుకలో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
WNP: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని వనపర్తి DWO సుధారాణి అన్నారు. అందుకు సంబంధించిన గోడపత్రికను గురువారం DWO కార్యాలయంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి ఆమె విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 18 సం.లు నిండకుండానే వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని పెళ్లికి సహకరించిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
SRPT: తుంగతుర్తిలోని ఎక్సైజ్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 7న సారాయి కేసుల్లో పట్టుబడిన స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత గురువారం తెలిపారు. ఈ మేరకు 15 ద్విచక్ర వాహనాలు, 1 మినీ డీసీఎంకు ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనేందుకు సగం ధరావతు సొమ్ము చెల్లించి పాల్గొనాలని కోరారు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఏకంగా 19 సిక్సర్లు బాదింది. దీంతో ప్రస్తుత T20 WCలో టీమిండియా ఖాతాలో 84 సిక్సర్లు* చేరాయి. ఫలితంగా, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో 76 సిక్సర్లతో వెస్టిండీస్ (2026) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
PDPL: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నూతన సీఈఓగా సంజీవ్ గులాటి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్, ప్లాంట్ నిర్వహణలో నిపుణులు. సంజీవ్ గులాటి నాయకత్వంలో సంస్థ మరిన్ని ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రక్రియ చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో 16 వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన కంపెనీ, తాజాగా రోబోటిక్స్ యూనిట్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. దాదాపు 100 మంది వైట్‌కాలర్ ఉద్యోగులపై దీని ప్రభావం ఉండొచ్చని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
HNK: పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని CP సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను నేడు సీపీ సందర్శించారు. ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించకుండా విధులు నిర్వహించాలని అన్నారు.
PPM: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని గిరిజన జేఏసీ నాయకులు గురువారం పాచిపెంట మండలం పెద్దవలసలో ధర్నాను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రాంతంలో జాబితాను గిరిజన సంక్షేమ శాఖలో పొందుపరచమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలుపుతామని వారు హెచ్చరించారు.
VZM: బొబ్బిలి రాజుల ఇలవేల్పు శ్రీ వేణుగోపాలస్వామి వారికి ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహించే డోలాయాత్రను గురువారం స్థానిక ఫూల్ బాగ్‌లో నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ఈరోజు సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ నథింగ్ రెండు స్మార్ట్ ఫోన్లను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. నథింగ్ ఫోన్ 4ఏ, నథింగ్ ఫోన్ 4ఏ ప్రో పేరిట వీటిని లాంచ్ చేసింది. నథింగ్ 3ఏ ఫోన్ మాదిరిగానే 4ఏ సిరీస్‌లోనూ ఫోన్ వెనుక భాగంలో గ్లిఫ్ మాట్రిక్స్‌ను తెచ్చింది. వీటి ధరలు రూ.32 వేల నుంచి ప్రారంభం కానున్నాయి.
ADB: పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల గడిచిన సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కోశాధికారి రవీందర్, నర్సింలు, స్వామి, రాజు, కిషన్, అశోక్ రెడ్డి, సుభాష్ తదితరులు ఉన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామ సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బాల కంబయ్య బైకుపై కొలిమిగుండ్లకు బయల్దేరాడు. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. బాల కంబయ్య తీవ్రంగా గాయపడటంతో 108లో తాడిపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి రిఫర్ చేశామని 108 సిబ్బంది తెలిపారు.
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్.. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచుంది. అయితే, T20 WC నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2016 సెమీఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్ 193 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఈ రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తుందా..? లేదా..? కామెంట్ చేయండి.