• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడుతున్నారా?

ఫ్యాటీ లివర్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో విషపదార్థాల స్థాయిలు పెరుగుతాయి. నారింజ, నిమ్మకాయ, బత్తాయి, కమలాఫలం వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాలేయాన్ని విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.

March 6, 2026 / 04:20 AM IST

ఆస్తికోసం కన్న తండ్రిపై దాడి చేసిన ఆర్మీ జవాన్

ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాటి శ్రీనివాసులు రెడ్డి (60) అనే వృద్ధుడిపై అతని సొంత కుమారుడు భాస్కర్ రెడ్డి (ఆర్మీ జవాన్) విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసులు రెడ్డిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్తి కోసమే భాస్కర్ రెడ్డి తండ్రిపై దాడి చేశాడు.

March 6, 2026 / 04:12 AM IST

తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

TG: గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఆయన 1952లో గోరఖ్‌పూర్‌(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్‌పూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2023 నుంచి హిమాచల్ గవర్నర్‌గా ఉన్నారు.

March 6, 2026 / 04:12 AM IST

‘మృత్యుంజయ్‌’ని ఎంజాయ్‌ చేస్తారు: శ్రీ విష్ణు

‘మృత్యుంజయ్’ ప్రీమియర్ షోకి వచ్చిన వారి స్పందన చూశానని, అందరూ ఎంజాయ్ చేశారని హీరో శ్రీవిష్ణు తెలిపాడు. సిినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజయ్ చేస్తారని, రాజమౌళి నుంచి ఈ సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ అయిందన్నాడు. NTR ట్రైలర్‌ రిలీజ్‌ చేశారని, నానీ తమ మూవీ చూసి మెచ్చుకున్నారని గుర్తుచేశాడు.

March 6, 2026 / 02:00 AM IST

మార్చి 06: చరిత్రలో ఈరోజు

1913: సినీ నటుడు కస్తూరి శివరావు జననం1917: మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు జననం1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణశర్మ జననం1933: సినీ నటి కృష్ణకుమారి జననం1984: హీరో శర్వానంద్ జననం1995: స్వాతంత్య్ర సమరయోధుడు మోటూరి సత్యనారాయణ మరణం1997: హీరోయిన్ జాన్వీ కపూర్ జననం

March 6, 2026 / 01:30 AM IST

250+ అయినా కొట్టొచ్చు: సంజూ శాంసన్‌

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన సంజూ శాంసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కీలకమైన మ్యాచుల్లో రాణించడం ఆనందంగా ఉంది. వాంఖడే పిచ్‌పై 250+ పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించేందుకు ఆస్కారముందని అనిపించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు జస్‌ప్రీత్ బుమ్రా అర్హుడని నా భావన. అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌’ అని తెలిపాడు.

March 6, 2026 / 01:15 AM IST

మార్చి 06: శుక్రవారం పంచాంగం

➠ తిథి: బహుళ తదియ సా.5:24 వరకు తదుపరి చవితి ➠ నక్షత్రం: హస్త ఉ.9:18 వరకు, తదుపరి చిత్త ➠ శుభ సమయాలు: ఉ.6:16-8:36, ఉ.10:11-11:10, మ.1:19-సా.4:04, సా.5:02-5:48 వరకు ➠ రాహుకాలం: ఉ.10:30-12:00 వరకు ➠ యమగండం: మ.3:00-4:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:37-9:24, మ.12:32-1:19 వరకు ➠ వర్జ్యం: సా.5:49-రా.7:32 వరకు ➠ అమృత ఘడియలు: తె.4:03 నుంచి 5:46 వరకు

March 6, 2026 / 12:30 AM IST

అమెరికా దాడి చేయడం దురదృష్టకరం: CM ఒమర్

హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇండియాలో నేవీ విన్యాసాల అనంతరం వెళ్తున్న షిప్‌పై దాడి చేశారు. వాళ్లు మన అతిథులు. ఈ వ్యవహారంలో మన దేశాన్నీ లాగుతున్నారు’ అని చెప్పారు. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారని, వాళ్లను సహించబోమని హెచ్చరించారు.

March 6, 2026 / 12:20 AM IST

కుట్రపూరితంగానే దాడి: అంబటి రాంబాబు

AP: ప్రభుత్వం తనపై కుట్రపూరితంగానే దాడి చేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ పనిగట్టుకుని దాడి చేయించిందని, పార్టీలకతీతంగా కాపులు తనకు సంఘీభావం తెలిపారన్నారు. ఈ ఘటనతో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడిందన్నారు. అదేంటో రాబోయే రోజుల్లో చూస్తారని పేర్కొన్నారు. తాను అనని మాటలను కూడా రిమాండ్ రిపోర్టులో పెట్టారని, చంద్రబాబుకు తెలియకుండా జరిగాయా అని ప్రశ్నించారు.

March 6, 2026 / 12:10 AM IST

తెలంగాణకు కొత్త గవర్నర్.. ఎవరంటే?

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణకు శివప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బీహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ రవిని నియమించింది.

March 5, 2026 / 11:20 PM IST

పెరిగిన భారత్-అమెరికా విమాన టికెట్ ధరలు

న్యూయార్క్, షికాగో, నెవార్క్ నుంచి ముంబై, ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల ధరలు పెరిగాయి. న్యూయార్క్ (జేఎఫ్‌కే విమానాశ్రయం) నుంచి ఢిల్లీకి వచ్చే విమానాల్లో ప్రస్తుతం రూ.1.34 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉంటాయి. షికాగో-ముంబై రూట్‌లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి రూ.1.9 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు చేరాయి.

March 5, 2026 / 11:15 PM IST

సుప్రీంకోర్టు కీలక తీర్పు

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి రూ.25 వేలను భార్య ఖాతాలో జమ చేయాలని ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన హక్కు’ అని జడ్జి పేర్కొన్నారు.

March 5, 2026 / 10:59 PM IST

BREAKING: ఫైనల్‌కు భారత్

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246/7 రన్స్‌కే పరిమితమైంది. బెతెల్‌ 105, బట్లర్ 25, విల్‌ జాక్స్‌ 35 రన్స్‌ చేశారు. 

March 5, 2026 / 10:53 PM IST

తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు కొత్త రైళ్లు

రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు రైళ్లు ప్రయాణించనున్నట్లు ప్రకటించింది. విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉ.8:20కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మ.2:50కు కొల్లాం చేరుకుంటుంది. చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి మంగళవారం ఉ.7:15కు బయలుదేరి మరుసటి రోజు ఉ.11:20కి షాలిమార్‌కు చేరుకుంది.

March 5, 2026 / 10:45 PM IST

చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా: కొలికపూడి

AP: మాజీ సీఎం జగన్‌పై పోరాడినప్పుడు కూడా తనపై దాడులు జరగలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నన్ను భూమిపై లేకుండా చేయాలన్న కుట్రలపై విచారణ చేయాలి. సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా. నన్ను అవమానిస్తే సహిస్తా.. కానీ, నాజాతిని అవమానిస్తే తెగిస్తా’ అని పేర్కొన్నారు.

March 5, 2026 / 10:10 PM IST