• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నల్లమల అటవీలో అగ్నిప్రమాదం..!

NDL: నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం పెద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని శ్రీశైలం రేంజ్ పెచ్చెర్వు ప్రాంతంలో అడవికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. ఫారెస్ట్ ప్రొటెక్షన్ బైకులు కూడా దెబ్బతిన్నాయి. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అప్పావ్ దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

March 6, 2026 / 06:12 AM IST

గ్రామాల్లో అభివృద్ధిపై పెద్దిరెడ్డి ఆరా..!

CTR: రొంపిచర్ల మండలంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. చెంచమరెడ్డిగారి పల్లి గ్రామపంచాయతీ, బుసిరెడ్డిగారిపల్లిలో ప్రజలతో మమేకం అయ్యారు. పెద్దమల్లెల గ్రామపంచాయతీలో సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అని హామీ ఇచ్చారు.

March 6, 2026 / 06:10 AM IST

‘అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు’

KMM: కల్లూరు మండలం పెద్ద కోరుకోండి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తీసుకొచ్చిన ఇసుక ట్రాక్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.హరిత తెలిపారు. ఆంధ్రాలో తక్కువ రేటు పలుకుతుందని అక్రమంగా తెలంగాణలోకి వచ్చి ఇసుకను అమ్ముతున్నారని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

March 6, 2026 / 06:09 AM IST

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

JGL: రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లిలో శ్రీ గురువారం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి విగ్రహాలను తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

March 6, 2026 / 06:09 AM IST

మా అమ్మ కవిత సిద్దిపేట నుంచే పోటీ చేస్తుంది: ఆదిత్య

SDPT: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా అమ్మ కల్వకుంట్ల కవిత సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందని కవిత కుమారుడు ఆదిత్య స్పష్టం చేశారు. సిద్దిపేటలోని ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు కలిసి ఆదిత్యను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.

March 6, 2026 / 06:08 AM IST

నేడు ఎంపీ అంబికా అధ్యక్షతన ‘దిశ’ సమావేశం

అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవనంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు జెడ్పీ సీఈవో శివశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దిశ’ చైర్మన్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నాలుగో త్రైమాసిక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.

March 6, 2026 / 06:08 AM IST

APPLY NOW: మే 21, 22న డీఈఈసెట్

TG: డీఈఈసెట్‌కు సంబంధించి మే 21, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. MAR 15 నుంచి APR 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, APR 17, 18న ఎడిట్ ఆప్షన్, MAY 15 తర్వాత హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ‘కీ’ మే 25న, అదేరోజు అభ్యంతరాల స్వీకరణ. JUNE 1-6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, JUNE 6-8 వెబ్ ఆప్షన్, 9న ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం, 14న సీట్లు కేటాయిస్తారు.

March 6, 2026 / 06:05 AM IST

అదుపు తప్పి బోల్తా పడిన కారు, ఒకరు మృతి

VZM: గజపతినగరం మండలం మరుపల్లి NH పై ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద మానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

March 6, 2026 / 06:03 AM IST

10వ తేదీన ప్రతిభ పరీక్ష

SKLM: సారవకోట మండలం పెద్దలంబ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 10న ఐదో తరగతి విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హెచ్ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్న విజేతలకు జ్ఞాపికలతోపాటు నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు 6281368168ను సంప్రదించాలన్నారు.

March 6, 2026 / 06:00 AM IST

ALERT: మరింత పెరగనున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే వేడిగాలులు కారణంగా ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు అయితే అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 38 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

March 6, 2026 / 05:55 AM IST

అమ్మవారి ఆలయంలో నగలు మాయం

నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో అమ్మవారి ఆలయంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి రెండు మంగళసూత్రాలు, ఆరు కాసులు, వెండి కిరీటం, వెండి శఠ గోపం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ పూజారి రవితేజ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 6, 2026 / 05:50 AM IST

సీఎంతో ఎమ్మెల్యే యరపతినేని భేటీ

PLD: మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన పులిచింతల ముంపు బాధితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 6 కోట్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబును కోరారు. గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, గురజాల నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.

March 6, 2026 / 05:49 AM IST

నో హెల్మెట్ – నో ఎంట్రీ.. కలెక్టర్ వినూత్న నిర్ణయం

SRPT:  సూర్యాపేట జిల్లా కలెక్టర్ హెల్మెట్ పై అవగాహన పెరిగేలా వినూత్న ఆలోచన చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది హెల్మెట్ ధరించని వాహనదారులను కలెక్టరేట్‌లోకి అనుమతించడం లేదు.

March 6, 2026 / 05:48 AM IST

వై జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ఎన్టీఆర్: నందిగామ వై జంక్షన్ వద్ద ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేని వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. సీఐ వైవీఎల్ నాయుడు మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.

March 6, 2026 / 05:40 AM IST

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఆగమశాస్త్రం ప్రకారం ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహించనున్నారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఈ క్రతువును వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 9 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.

March 6, 2026 / 05:40 AM IST