KNR: వ్యవసాయం, గ్రామీణ పరివర్తనపై ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ పోస్ట్-బడ్జెట్ వెబ్నార్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జమ్మికుంటలోని రైతు వేదిక ఆబాదిలో ప్రసారం చేయనున్నట్లు AO షేక్ ఖాదర్ హుస్సేన్ తెలిపారు. అధిక విలువైన పంటలు, డిజిటల్ వ్యవసాయం, మత్స్య అభివృద్ధి వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.
PPM: అద్దె బస్సుల డ్రైవర్‌లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు CITU జిల్లా కార్యదర్శి ఎస్.వై నాయుడు మాట్లాడుతూ.. గురువారం రాత్రి ఓనర్లకు, డ్రైవర్ ప్రతినిధులకు జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని తెలిపారు. డ్రైవర్‌లకు జీతాలు పెంచడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు ఓనర్లు బాధ్యత వహించడానికి, పండగ బోనస్ ఇవ్వడానికి ఓనర్లు సమ్మతించడంతో సమ్మె విరమించామన్నారు.
VSP: జీవీఎంసీ 50వ వార్డు సాయిరాం నగర్‌లో గురువారం సాయంత్రం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ పాల్గొని పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారం చేపట్టేందుకు కృషి చేయాలన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోర్ట్‌లు, ఎయిర్‌పోర్టుల మూసివేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. నిల్వలు పెరిగిపోవడంతో కోడి గుడ్డు ధర భారీగా పడిపోయింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ధర రూ.4.30గా నిర్ణయించింది. స్థానిక మార్కెట్లలో రూ.3.50కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం పడింది.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాఖలకు సంబంధించిన పలు అంశాలు, ప్రాంతీయ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు.
SGR: జిల్లాలో 99 రోజుల పాటు చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి చేరడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజుల పాటు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి చేరడమే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో జరిగే ఈ ప్రత్యేక డ్రైవ్‌ను విజయవంతం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు పేర్కొన్నారు.
PDPL: 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 13-18 వరకు ప్రత్యేక ‘Arrive-Alive’ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిన్న సంబంధిత అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు.
దుబాయ్‌లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న వారికి నటుడు సోనూసూద్ ఉచిత వసతి కల్పిస్తున్నారు. ఏ దేశస్థులైనా పర్వాలేదు, ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉచితంగా బస చేయవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మాత్రమే ముఖ్యం అని సోనూసూద్ పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ చేస్తే, తన టీమ్ సంప్రదించి ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి మాజీ వార్డ్ మెంబర్ సభ్యుడు స్వామి జన్మదినం సందర్భంగా సర్పంచ్ ఆవుల సుందరయ్య వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వామికి గురువారం రాత్రి ఒక మొక్కను, హెల్మెట్‌ను బహుకరించి సామాజిక బాధ్యతను చాటారు. కార్యక్రమంలో మహిళా సంఘాల జిల్లా అధ్యక్షురాలు ఆవుల మాధవి, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ, నాయకులు పొలిమేర శంకర్, రవి ఉన్నారు.
NDL: నిషేధిత వస్తువులను శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌వో శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆలయ సమీపంలోని టోల్‌గేట్ వద్ద వాహనాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకు రావద్దని సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి అన్యమత ప్రచార వస్తువులను తీసుకువస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
SRPT: 2024 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కారు డ్రైవర్ షేక్ బాజీకి కోదాడ కోర్టు గురువారం 15 నెలల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధించిందని అనంతగిరి ఎస్సై నవీన్ తెలిపారు. తమరబండపాలెం వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో మోహన్ రావు మృతి చెందగా, పవన్ గాయపడ్డారు. కేసు సమర్థవంతంగా విచారించిన అనంతరం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ ఆదేశాలతో రోడ్లపై ఆక్రమణలను గుర్తించి షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. రోడ్డుపై వస్తువులు పెట్టి వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదని, గడువులోగా తొలగించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బంది హెచ్చరించారు. అక్రమ కట్టడాల తొలగింపుకు సహకరించాలన్నారు.
BHNG: బీఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. బస్వాపూర్ రిజర్వాయర్ కారణంగా తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోందని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్కు విన్నవించారు. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
కడప: YCP నుంచి TDPలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల ముగ్గురు కార్పొరేటర్లు TDPలో చేరగా తాజాగా మరో కార్పొరేటర్ చేరారు. కడప MLA మాధవి రెడ్డి,TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మతోపాటు, డివిజన్ ఇంఛార్జ్ బండి ప్రసాద్ పార్టీ మారారు. CM చంద్రబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.