హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇండియాలో నేవీ విన్యాసాల అనంతరం వెళ్తున్న షిప్పై దాడి చేశారు. వాళ్లు మన అతిథులు. ఈ వ్యవహారంలో మన దేశాన్నీ లాగుతున్నారు’ అని చెప్పారు. కశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారని, వాళ్లను సహించబోమని హెచ్చరించారు.