• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వడదెబ్బకు కుప్పకూలిన వ్యక్తి.!

HYD: సికింద్రాబాద్‌ ఆలుగడ్డ బావిలో తీవ్రమైన వేడి కారణంగా ఓ వ్యక్తి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. 108 సిబ్బంది EMT స్వర్ణ, పైలట్ వెంకటేశ్ వెంటనే బాధితుడిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అంబులెన్స్‌లోనే వైద్య సహాయం అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

March 5, 2026 / 10:08 PM IST

బీఆర్ఎస్ కార్యకర్త సతీష్ మృతి

ఖమ్మం 2వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుక్కల సతీష్ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగర BRS అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సతీష్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.

March 5, 2026 / 10:02 PM IST

కుక్కల దాడిలో రెండు గొర్రెల మృతి

NZB: కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ గ్రామంలో గురువారం గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఏడు గొర్రెలకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు మల్లేష్ తెలిపారు. కుక్కల దాడి వల్ల సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు నష్టము వాటిలిందని బాధితుడు మల్లేష్ వాపోయాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

March 5, 2026 / 10:00 PM IST

అంతరాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్.. ఆరు బైకులు స్వాధీనం

SRPT: హుజూర్ నగర్ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హుజూర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.లక్షల విలువ చేసే ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమంద రాజు వెల్లడించారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

March 5, 2026 / 10:00 PM IST

మహిళా దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగడానికి ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, విభాగాధికారి సమన్వయంతో వేడుకలు, హెల్త్ చెకప్ శిబిరాలు, మహిళల రక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

March 5, 2026 / 09:57 PM IST

అభిషేక్ శర్మపై నెటిజన్ల ఫైర్

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన కీలకమైన సెమీఫైనల్‌లోనూ ఘోరంగా విఫలమవడంతో, అతడిని జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకోవడం వల్ల మిగిలిన బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అభిమానులు మండిపడుతున్నారు.

March 5, 2026 / 09:56 PM IST

టీడీపీ పనిగట్టుకుని దాడి చేయించింది: అంబటి

AP: టీడీపీ పనిగట్టుకుని తన ఇంటిపై దాడి చేయించిందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పార్టీలకతీతంగా కాపులు నాకు సంఘీభావం తెలిపారు. కూటమిలో ఉన్న కాపులు కూడా సంఘీభావం తెలిపారు. ఘటనలో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడింది. అదేంటో రాబోయే రోజుల్లో చూస్తారు. నేను అనని మాటలను కూడా రిమాండ్ రిపోర్టులో పెట్టారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియకుండా జరిగాయా?’ అంటూ ప్రశ్నించారు.

March 5, 2026 / 09:48 PM IST

విజయానికి 151 దూరంలో.. ఉత్కంఠగా సెమీస్

254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కేవలం 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. అయితే.. సాల్ట్ (5), బట్లర్ (25), బ్రూక్ (7), బంటన్ (17) వంటి కీలక బ్యాటర్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జాకబ్ బెథల్ (43), విల్ జాక్స్ (4) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 71 బంతుల్లో 151 పరుగులు చేయాల్సి ఉంది.

March 5, 2026 / 09:47 PM IST

GOOD NEWS: రైల్వేలో భారీగా ఉద్యోగాలు

కోణార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటేడ్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు konkanrailway.comను సంప్రదించండి.

March 5, 2026 / 09:45 PM IST

పలు శుభకార్యాలకు చంద్రబాబు హాజరు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శుభకార్యాలకు హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో వీఆర్ శ్రీనివాస్ కుమారుడి వివాహానికి హాజరైన ఆయన.. వధూవరులు వేంకటరామానుజ జశ్వంత్, తారక రస్యకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అలాగే, కానూరులో తోటకూర వెంకట విజయ్ కుమార్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులు గోపీచంద్, మాల్వికకు సీఎం దీవెనలు అందించారు.

March 5, 2026 / 09:43 PM IST

విజయ్ దేవరకొండ ఇంటికి సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి నటుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, హైదరాబాద్ తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు నిన్న ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో జరిగిన విషయం తెలిసిందే.

March 5, 2026 / 09:42 PM IST

సూర్యాపేటలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ శివారు వ్యవసాయ భూమిలో గురువారం ఓ వ్యక్తి (35) వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు నీలం రంగు గడుల చొక్కా, ఎరుపు రంగు లోయర్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసిన వారు సూర్యాపేట పట్టణ పోలీసులను సంప్రదించాలని సీఐ వెంకట్ కోరారు.

March 5, 2026 / 09:35 PM IST

‘జగన్ కోవర్టునని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’

AP: తాను మాజీ సీఎం జగన్ కోవర్ట్ అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని, 10 శాతం ఓట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. తన చిట్టా తెలుసంటున్నారని, తెలిస్తే బయటపెట్టాలని సవాల్ విసిరారు. తనపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారమున్నా.. సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించారు.

March 5, 2026 / 09:33 PM IST

నవాబ్పేట్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

VKB: ఎల్లకొండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సర్పంచ్ కావాలి కొండల్ యాదవ్ అన్నారు. గురువారం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నూతన బోరు వేసే పనులను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

March 5, 2026 / 09:32 PM IST

చందూర్ ఇఫ్తార్ విందులో హనుమాన్ మాలధారులు

NZB: చందూర్ మండల కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, మైనారిటీ సభ్యులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హనుమాన్ మాలధారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, వీడీసీ ప్రెసిడెంట్ బొట్టే శంకర్, మాజీ ఉప సర్పంచ్ శేఖర్, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి రాంరెడ్డి పాల్గొన్నారు.

March 5, 2026 / 09:30 PM IST