• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పిల్లలు, వృద్ధులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

March 5, 2026 / 07:24 PM IST

అభిషేక్ ఔట్… సంజూ శాంసన్ క్యాచ్ మిస్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అలాగే, ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. ప్రస్తుతం సంజూ(31), కిషన్(15) క్రీజులో ఉన్నారు. భారత్ 5 ఓవర్లలో 55/1

March 5, 2026 / 07:24 PM IST

A2 పాలు, నెయ్యితో పాడిరైతుకు సుస్థిర ఆదాయం: కలెక్టర్

NTR: దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. గురువారం వ‌త్స‌వాయి మండ‌లం, కంభంపాడులోని చేకూరి ర‌మేష్‌బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాల‌ను సంద‌ర్శించారు. దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, వాటితో తయారు చేసే నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాం...

March 5, 2026 / 07:23 PM IST

డాక్టర్‌కి మహిళా దినోత్సవ పురస్కారం

VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

March 5, 2026 / 07:23 PM IST

స్వప్న హైందవికి మహిళా దినోత్సవ పురస్కారం

VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

March 5, 2026 / 07:23 PM IST

నిజాం కాలేజ్ NSUI నూతన అధ్యక్షుడిగా వరుణ్

HYD: NSUI తెలంగాణ రాష్ట్ర యూనిట్ కీలక నియామకాలు చేసింది. ఇందులో భాగంగ కొత్తగాడి వరుణ్ కుమార్‌ను నిజాం కాలేజీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాలను NSUI రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

March 5, 2026 / 07:22 PM IST

అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

రోజువారీ ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరంలోని మంటను తగ్గించే ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే, వికారం, అజీర్ణం వంటి సమస్యలను నిమిషాల్లో తగ్గిస్తుంది. ముఖ్యంగా అల్లం టీ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.

March 5, 2026 / 07:22 PM IST

‘నేరాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్ర’

VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మహిళల భద్రత, హక్కులపై ప్రత్యేక వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. అలాగే, విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించాలన్నారు.

March 5, 2026 / 07:21 PM IST

‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి’

ADB: మహిళలు ధైర్యంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఎదుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని ఆమె అన్నారు.

March 5, 2026 / 07:21 PM IST

వన్యప్రాణంలో సంరక్షణపై అవగాహన

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో మన్య ప్రాణుల సంరక్షణ గురించి ఇవాళ అవగాహన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరుణ హాజరై మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడకూడదని, అడవిలోకి ప్లాస్టిక్ తీసుకెళ్లకూడదని విద్యార్థులకు సూచించారు. మూగజీవాలకు హాని తలపెట్టకుండా పర్యావరణాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.

March 5, 2026 / 07:21 PM IST

సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి

AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం సమకూర్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం కర్రివానిపాలెంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథం షెడ్యూల్ ప్రకారం వస్తుందన్నారు. స్వచ్చ రథం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

March 5, 2026 / 07:21 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆలయ ఈవో రంగాచారి అందజేశారు.

March 5, 2026 / 07:20 PM IST

కూచిపూడి గ్రామంకు సాంస్కృతిక వారసత్వ కేంద్రం

కృష్ణా: ప్రసిద్ధ నాట్యకేంద్రంగా గుర్తింపు పొందిన కూచిపూడి గ్రామంను సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

March 5, 2026 / 07:20 PM IST

మార్చి 7న గుంటూరులో మహిళల అథ్లెటిక్స్ లీగ్

GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బీఆర్ స్టేడియంలో మార్చి 7న భారీ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మై భారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, డీఎస్‌డీఓ పఠాన్ ఆఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అండర్-13, 13-18, 18 ఏళ్లకు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగుపందేలు నిర్వహించనున్నామని వారు వెల్లడించారు.

March 5, 2026 / 07:20 PM IST

గ్రామ సంఘ కమిటీ జెండర్ కమిటీల శిక్షణ

VZM: కొత్తవలస మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం వెంకటరమణ ఆద్వర్యంలో గ్రామ సంఘ జెండర్ కమిటీల శిక్షణ గురువారం నిర్వహించారు. లింగ అసమానతలు హింస, వివక్షపై అవగాహన ఉండాలని సూచించారు. సమాజంలో మహిళ ఆర్థిక సహకారాలు, తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 07:19 PM IST