• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌతవరం గ్రామంలో రోడ్డు భద్రత, మహిళల భద్రత, పోక్సో కేసులు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్‌వి‌వి సత్యనారాయణ నిర్వహించారు. అపరిచిత కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 5, 2026 / 08:28 PM IST

చేనేతల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

E.G: అమరావతిలో బీ.సీ సంక్షేమం, చేనేత జౌళి శాఖా మంత్రి ఎస్.సవితను గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. వీలైనంత త్వరగా చేనేతలకు రావలసిన బకాయిలను అందించి, వారిని ఆదుకోవాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.

March 5, 2026 / 08:28 PM IST

‘ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షిక క్రీడలు ముగింపు కార్యక్రమం’

నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వార్షిక క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభ, జట్టు భావన, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సుజాత తెలియజేశారు. ఈ కార్యక్రమం చాలా ఆనందభరిత వాతావరణంలో ముగిసినట్లు తెలిపారు.

March 5, 2026 / 08:28 PM IST

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

కడప: నగర 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మ ఇటీవల వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి సహకరించాలని సీఎం సూచించారు.

March 5, 2026 / 08:27 PM IST

‘కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం’

PDPL: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి రాజ్ కుమార్ హెచ్చరించారు. GDKభాస్కరరావు భవన్‌లో యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. గతంలో యాజమాన్యంతో జరిగిన మీటింగ్‌లో ప్రస్తావించిన డిమాండ్లను అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:26 PM IST

మహిళలకు సానిటరీ ప్యాడ్ కిట్లు పంపిణీ

SDPT: బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లహరి ఆధ్వర్యంలో గురువారం చిన్నకోడూరు మండలం ఎల్లమ్మ జూలూరు గ్రామంలో మహిళలకు సానిటరీ కిట్లను కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్య క్షురాలు ముద్ధం లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల మహిళలకు నెలసరికి వాడే సానిటరీ కిట్స్ విషయంలో అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం మహిళలకు అందజేయడం శుభ పరిణామం అన్నారు.

March 5, 2026 / 08:26 PM IST

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: MLA

BHPL: చెల్పూర్ గ్రామంలో మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలు చెప్పేవి ఒకటేనని మనుషులంతా సోదరా భావంతో ఉండాలన్నారు. మసీదుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

March 5, 2026 / 08:25 PM IST

పది పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు వంటగది ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

March 5, 2026 / 08:23 PM IST

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పదోన్నతులు

కర్నూలు : కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ సహాయకులు, టైపిస్టులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నలుగురు ఉద్యోగులను సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి వెల్లడించారు.

March 5, 2026 / 08:23 PM IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

SRCL: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా కలెక్టరేట్లో ఆవిష్కరించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణా రాష్ట్రం లోని వివిధ క్రీడల పాఠశాలలు: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరంలో 4వ తరగతిలో ఆసక్తి గల బాలబాలికలు ప్రవేశం కల్పించనున్నారు.

March 5, 2026 / 08:21 PM IST

పమిడిముక్కలలో వాహన తనిఖీలు

కృష్ణా: పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంకిలాకులు సెంటర్ వద్ద సీఐ వై. చిట్టిబాబు, ఎస్‌ఐ బి. శ్రీను కలిసి వాహనాల తనిఖీలు గురువారం నిర్వహించారు. వాహనాల పత్రాలు, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.

March 5, 2026 / 08:20 PM IST

ఐటీడీఏ పీవోకు జేఏసీ వినతిపత్రం

BDK: బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో–3 పునరుద్ధరించి స్థానిక గిరిజనులతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అలాగే 1/70, పిసా చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.

March 5, 2026 / 08:19 PM IST

‘టవర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి’

ASR: జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, టవర్స్‌ను నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. బిఎస్ఎన్ఎల్, జియో నెట్వర్క్ సంస్థలకు సంబంధించిన అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఇబ్బందులు పరిష్కరించి, టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.

March 5, 2026 / 08:17 PM IST

188 పోస్టులు.. మార్చి 11 వరకు లాస్ట్ డేట్

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 188 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 11 వరకు NATS / NAPS పోర్టల్‌లో నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా అర్హతను భట్టి 13,500 నుంచి రూ. 20 వేల వరకు ఇస్తారు. వివరాలకు powergrid.in ను సంప్రదించండి.

March 5, 2026 / 08:15 PM IST

‘బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలి’

NRML: తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఎన్నికల హామీలు ఇచ్చిన పెన్షన్ పెంచే ఆమెని వెంటనే అమలు చేయాలని సీఐటీ జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికుల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ. 4016 పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేస్తారు.

March 5, 2026 / 08:15 PM IST