• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీవారి వైశాఖమాస కళ్యాణోత్సవాలు

ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు.

April 11, 2026 / 08:12 AM IST

జనాభా గణనను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ‘భారతదేశ జనాభా గణన 2027’ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన 2 దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

April 11, 2026 / 08:11 AM IST

జనగామలో మొబైల్ నంబర్ సవరణకు ప్రత్యేక డ్రైవ్

జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిన్న ఎరువుల బుకింగ్ యాప్ సేవల వినియోగంపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గ్రామాల వారీగా ఏఈఓల ద్వారా మొబైల్ నంబర్ సవరణకు షెడ్యూల్ రూపొందించారు. పాత నంబర్ పనిచేయని రైతులు తమ క్లస్టర్ ఏఈఓను సంప్రదించి కొత్త నంబర్ నమోదు చేసుకోవాలని. దీంతో ఎరువుల బుకింగ్, సరఫరా వివరాలు తెలుస్తాయన్నారు.

April 11, 2026 / 08:11 AM IST

తిరుపతిలో టెన్షన్ రేపిన అంత్యక్రియలు

TPT: తిరుపతి రూరల్ చెర్లోపల్లి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అంత్యక్రియల నేపథ్యంలో కాసేపు ఆందోళన రేపింది. చెర్లోపల్లి రజకుల కాలనీకి చెందిన రాధాకృష్ణయ్య మృతి చెందాడు. పెట్రోల్ బంకు పక్కనే ఆయనకు చెందిన స్థలం ఉండటంతో అక్కడే దహనక్రియలు చేశారు. ఇళ్లు, పెట్రోల్ బంకు వద్ద శవాన్ని కాల్చడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

April 11, 2026 / 08:10 AM IST

అంబులెన్స్‌ను ఢీకొట్టిన బస్సు.. ఇద్దరు మృతి

TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి సమీపంలో పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ఓ ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు పేషెంట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

April 11, 2026 / 08:09 AM IST

మీ ముందు కూర్చుంటేనే ప్రజా సేవ చేసినట్లా: DCCB ఛైర్మన్

VZM: సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్‌కి వెళ్లి ZP సమావేశానికి హాజరు కాలేకపోతే దానిని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం జిల్లా TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి MLAలు మీ ముందు కూర్చుంటేనే ప్రజా సేవ చేసినట్లా అని శ్రీనివాసరావును మీడియా ముఖంగా ప్రశ్నించారు.

April 11, 2026 / 08:09 AM IST

ప్రొద్దుటూరులో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్..!

KDP: ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు శుక్రవారం మోటార్ సైకిల్ దొంగను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల చోరీపై విచారణ చేపట్టి, స్థానిక నడింపల్లె వీధికి చెందిన షేక్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసినట్లు CI కొండారెడ్డి తెలిపారు. ఈ మేరకు SIలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డిలను జిల్లా SP అభినందించారు.

April 11, 2026 / 08:09 AM IST

ఫోన్ పే యాప్‌తో మోసం.. వ్యక్తి అరెస్ట్

సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో చిరువ్యాపారులను నకిలీ ఫోన్ పే యాప్‌‌తో మోసగిస్తున్న ఏపీకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్ వద్ద డబ్బులు కావాలని, ఫోన్ పే చేస్తానని నమ్మించే ప్రయత్నం చేయగా.. అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకున్నారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

April 11, 2026 / 08:09 AM IST

ట్రాన్స్ ఫార్మర్ వలన పొంచి ఉన్న ప్రమాదం

VKB: బంట్వారం మండలం నుర్ణంపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో స్థానికులకు ఆందోళన కలుగుతోంది. పశువులు ట్రాన్స్ ఫార్మర్ వద్దకు చేరే ప్రమాదం ఉండటంతో రైతులు భయపడుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అన్నారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని వారు కోరారు.

April 11, 2026 / 08:08 AM IST

పాలమూరుపై హరీష్ రావువన్నీ అబద్ధాలే: మంత్రి

WNP: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 80% పూర్తయిందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి పనులు ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం పంపులు ఆన్ చేసి ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా 97.5 శాతం మంది రైతులకు మేలు జరుగుతుంది అన్నారు.

April 11, 2026 / 08:08 AM IST

నిర్మల్‌లో ఇంటర్న్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం

NRML: జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం మూడో విడతకు దరఖాస్తులను ఆహ్వానించారు. 18–25 సంవత్సరాల యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 6 నుంచి 9 నెలల పాటు పరిశ్రమల్లో శిక్షణతో పాటు ప్రాక్టికల్ అనుభవం అందించనున్నారు. అర్హులు సమయానికి దరఖాస్తు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

April 11, 2026 / 08:06 AM IST

వ్యర్ధాలను కాల్చివేస్తున్న కంపెనీలపై చర్యలేవి..?

MDCL: ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గుజరాత్ ఫుడ్స్ కంపెనీ వద్ద వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేయడంతో గాలి కాలుష్యం పెరిగి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది TGPCB నిబంధనలకు విరుద్ధమని, వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

April 11, 2026 / 08:05 AM IST

కామారెడ్డి మార్కెట్‌లో కూరగాయల ధరల వివరాలు

కామారెడ్డి మార్కెట్‌లో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో బెండకాయ రూ. 50, పచ్చిమిర్చి రూ. 60, టమాట రూ. 20, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం రూ. 50 చొప్పున ఉన్నాయి. నిమ్మకాయలు అత్యధికంగా రూ. 180 పలుకుతుండగా, పాలకూర రూ. 80, గంగవాయి కూర రూ. 100గా ఉంది. బీరకాయ రూ. 40, వంకాయ రూ. 20, ఆలుగడ్డ రూ. 30కి విక్రయిస్తున్నారు.

April 11, 2026 / 08:04 AM IST

వార్షిక రుణ ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ

ATP: అనంతపురం టీటీడీసీ భవనంలో సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు వార్షిక రుణ, జీవనోపాధుల ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.శైలజ పాల్గొని మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రణాళికలో 50 శాతం జీవనోపాధులు వచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.

April 11, 2026 / 08:03 AM IST

తాడిపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తూ.గో: తాళ్లపూడి మండలం తాడిపూడి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు నామా వెంకట సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రుచిత పాల్గొన్నారు.

April 11, 2026 / 08:03 AM IST