NRML: ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో కాశీ, అయోధ్య బస్సును డిపో మేనేజర్ పండరి నేడు ప్రారంభించారు. ఈ బస్సు మైహార్, ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య, నైమి శారణ్య, ఉజ్జాయిని, ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రలకు వెళ్లి వస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల ఆదరణ తో అయోధ్యకు నాలుగో సారి సర్వీసును నడుపామని అన్నారు. ఈ యాత్ర అనంతరం గోవా, రామేశ్వరం టూర్ ఉంటుందని ఆయన తెలిపారు.
VSP: అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని APEPDCL సంస్థ ప్రాజెక్ట్స్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. అశోక్ అన్నారు. ఆదివారం గురుద్వారా కార్యలయంలో జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటనికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
WGL: నర్సంపేటలో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేఏసీ కన్వీనర్ డా. గద్ద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయా సాధన కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. మునిసిపల్ ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ వినూత్న ఇవాళ మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
HYD: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అపారమైనవని, కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారన్నారు.
TG: తాను పార్టీ మారుతానని పిచ్చి ప్రచారం చేస్తున్నారని MP ఈటల రాజేందర్ మండిపడ్డారు. KCR తనను బయటికి నెట్టి ఐదేళ్లవుతుందని పేర్కొన్నారు. ఆనాడు చెప్పుకుందామన్నా ఎవరూ వినలేని పరిస్థితి నెలకొందన్నారు. తాను, బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్నది అవాస్తవమని.. పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీలో ఆ ప్రచారానికి కొందరు ఊతమిస్తున్నారని చెప్పారు.
TG: భూపాలపల్లి రేగొండలోని రేపాకలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులు తండ్రిని చంపేశారు. చేరాలు భార్య హైదరాబాద్‌లో ఇద్దరు కుమారుల వద్ద ఉంటుంది. తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కుమారులు.. ఇంటికి వచ్చేసారికి వారిద్దరూ కలిసి ఉండటంతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చికిత్సపొందుతూ తండ్రి మృతి చెందాడు.
NRPT: కృష్ణ మండలం కున్సీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం డాక్టర్ సోమనాథ్ రెడ్డి (AME దంత వైద్యులు) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్య బృందం విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కావలసినటువంటి మందులు ఉచితంగా అందించారు.
ఎన్టీఆర్: తిరువూరు మండలం వామకుంట్లలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుండగా, వేద పండితుల మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
విశాఖ జిల్లా అధికారులు ఆధ్వర్యంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119 జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ, నిర్వహించారు. జేసీ విద్యాధరి, వివిధ సంఘాల నాయకులు హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పట్టాభిరాం పాల్గొన్నారు.
VZM: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఆదివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అదితి గజపతి రాజు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ కేంద్రమంత్రి గా దేశానికి ఎన్ని సేవలు అందించారని, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు.
AKP: నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. 22 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,28,729 ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
కోనసీమ: స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి బీజేపీ ఆధ్వర్యంలో మండపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ స్దానిక 8వ వార్డులో ఉన్న జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోన మాట్లాడుతూ.. బీహార్‌లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి బాబూజీగా ప్రసిద్దిగాంచారని పేర్కొన్నారు.
GDWL: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహనీయుల అడుగుజాడల్లో నడవడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
EG: రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి సోమవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు రాజమండ్రి బిజెపి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ జెండా ఆవిష్కరణ, 10:30 కు వాజ్పేయి విగ్రహం వరకు ర్యాలీ, సాయంత్రం 5కు కొవ్వూరు వాటర్ ట్యాంకు నుంచి విజయ విహార వరకు మన ఊరు- మన జెండా పాదయాత్ర, 6కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది.