HNK: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నేడు ఎంపీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
నారాయణపేట నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షులుగా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన దాసరి అశోక్ నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బొదిగలి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనను నియమించిన జిల్లా అధ్యక్షులకు ధన్యవాదలు తెలిపారు.
NZB: ధర్పల్లి మండలంలోని కర్నల్‌తండా వద్ద భగీరథ ట్యాంకు నిండి తాగు నీరు రోడ్డు పై పారుతుంది. మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయని ప్రజలు తెలిపారు. గ్రామాల్లో తాగు నీరు అందక ప్రజలు అల్లాడి పోతూ ఇబ్బందులు పడుతున్నారు. నీరు వృథాగా పోకుండా అందించాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.
‘ధురంధర్ 2 చిత్రాన్ని చూసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించాడు. సినిమా అద్భుతంగా ఉందని, రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్‌లకు తగిలిన దిష్టి పోవాలంటే మిరప తోటనే తగలబెట్టాలని తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దీనికి ఆదిత్య ధర్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపాడు. సందీప్ తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’మూవీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ, అవసరమైతే సాయం చేస్తానన్నాడు.
MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత- లక్ష్మణ్ బాబులు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని 1, 2 వార్డుల్లో శుక్రవారం ఉదయం వారు విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లోని పారిశుధ్య పనులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా ప్రభుత్వ లక్ష్యమైన భూగర్భ జలాల పెంపు పనులను పరిశీలించారు.
BDK: లక్ష్మీదేవిపల్లి (M) హేమచంద్రపురం సమీపంలోని చెట్ల పొదల మధ్య దాచి ఉంచిన సుమారు 70 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యాన్ని అధికారులు ఇవాళ పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం. గుప్త సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ నరసింహారావు పై కేసు నమోదు చేశారు.
KDP: మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో 4 మంది నిందితులకు తిరుపతి RSS స్పెషల్ JFCM కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు 2014లో నమోదవగా, నిందితులు ఎర్ర చందనం అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది.
NRPT: ఆత్మకూర్, అమరచింత, నర్వ మండలాల్లో ఎంపీ డీకే అరుణ నేడు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆత్మకూరులో పరమేశ్వర చెరువు సుందరీకరణ పనులను పరిశీలిస్తారు. అమరచింతలో పెద్ద చెరువు సుందరీకరణకు భూమిపూజ చేస్తారు. అనంతరం నర్వలో వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు.
AP: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు కొత్తగా ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి రావడం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణించే వారికి టైమింగ్స్ విషయంలో మరింత వెసులుబాటు కలగనుంది.
SDPT: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో BRS లో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారని, రాష్ట్రంలోని ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించనున్నారు.
AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామాన్ని తరలించాలని సీపీఎం నాయకుడు శంకర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 22 ఏళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉండటానికి వేగవంతమైన జీవక్రియ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు లెప్టిన్ హార్మోన్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఆహారంతో పాటు వారి జన్యువులు, తగినంత నిద్ర, చురుకైన జీవనశైలి, మెరుగైన జీర్ణక్రియ వంటి అంశాలు వారు బరువు పెరగకుండా, ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వారు ఆరోగ్యంగా కనిపిస్తారట.
NRPT: దమగాన్పూర్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్రాములు తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా పనుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామసభలో చర్చించిన అనంతరం ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఎంపీడీవో రామన్నకు గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు.
KRNL: ఆదోనికి చెందిన బత్తిని కుబేర్ నాథ్‌ను జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా నియమిస్తూ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా కుబేర్ నాథ్ తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
AP: సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం వేటను నిషేధించింది. మెకనైజ్డ్ బోట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తించనుండగా.. సాధారణ పడవలకు మినహాయింపు కల్పించింది. ఈ 61 రోజులు ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ఆసరాగా రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. మే నెలలోనే ఈ నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించింది.