• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేతువానిపల్లి శివారులో చిరుత దాడి: లేగదూడ మృతి

GDWL: జిల్లా నేతువానిపల్లి శివారులో చిరుత దాడిలో ఒక లేగదూడ మృతి చెందింది. ఘటనా స్థలాన్ని FRO పర్వేజ్ అహ్మద్ సందర్శించి, పాదముద్రలను ధృవీకరించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టవద్దని, రక్షణ చర్యలు చేపడతామని ఉన్నతాధికారులకు నివేదించారు.

April 11, 2026 / 06:50 AM IST

‘విద్యార్థులు 9:30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి’

సత్యసాయి: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని జిల్లా కన్వీనర్ జమున బాయి తెలిపారు. విద్యార్థులు ఉదయం 9:30 గంటలకే హాల్‌టికెట్, ఆధార్ కార్డుతో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

April 11, 2026 / 06:49 AM IST

నిలోఫర్ అక్రమ నిర్మాణాలపై లోకయుక్త ఆగ్రహం

HYD: బంజారాహిల్స్ నిలోఫర్ ఛాట్ అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యాపారాలపై రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. స్పందించిన తెలంగాణ ఉప లోకాయుక్త హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ, దీనిపై మే 6 లోగా నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

April 11, 2026 / 06:49 AM IST

ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

TG: సూర్యపేట జిల్లా కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

April 11, 2026 / 06:48 AM IST

ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు

AP: కాజీపేట విద్యార్థిని హత్య కేసులో నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు నుంచి తరలిస్తుండగా బాసాపురం చెక్‌పోస్ట్ వద్ద పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో నిందితుడి కాలికి తీవ్ర గాయమై, పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా బహిరంగంగా ఉరిశిక్ష వేయాలంటూ గ్రామస్థులు హైవేపై భారీ ధర్నా చేపట్టారు.

April 11, 2026 / 06:48 AM IST

అటవీ అనుమతులపై అలసత్వాన్ని ఉపేక్షించబోము: JC

PPM: అటవీ అనుమతులపై అలసత్వాన్ని ఉపేక్షించబొమని JC యశ్వంత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ అనుమతులు లేక చాలా పనులు ఆగిపోయాయని, ముఖ్యంగా డోలి రోడ్లు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. అటవీ అనుమతుల కోసం పంపే ప్రతిపాదనలు కచ్చితమైన ఫార్మాట్‌లో ఉండాలన్నారు.

April 11, 2026 / 06:48 AM IST

‘ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి’

ప్రకాశం: సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 11, 2026 / 06:47 AM IST

హరీశ్రావుపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం

MBNR: పాలమూరు ప్రజలను అమాయకులుగా భావించవద్దని హరీశ్రావుపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే కట్టారని గుర్తు చేస్తూ, జిల్లా వెనుకబాటుకు గత BRS ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

April 11, 2026 / 06:47 AM IST

గేదెల దొంగల హల్‌చల్.. గ్రామస్తుల్లో ఆందోళన

SRPT: అనంతగిరి మండలం రంగయ్యగూడెం గ్రామంలో పశువుల దొంగతనాలు పెరిగిపోతుండటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం రాత్రి ఎర్రపు హనుమంతయ్య అనే రైతు ఇంటి ముందు కట్టేసిన దూడను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీనిపై బాధితుడు శుక్రవారం అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

April 11, 2026 / 06:47 AM IST

నాణ్యమైన మెనూ అమలు చేయాలి: జేసీ

ASR: పాడేరు మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సందర్శించారు. ముందుగా విద్యార్థులతో ముచ్చటించి, విద్యా, భోజన వసతులపై ఆరా తీసి, భోజనశాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన మెనూ అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

April 11, 2026 / 06:46 AM IST

పలువురు జడ్జిల బదిలీ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా జడ్జి పీ.వసంత్ ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు వికారాబాద్ కోర్టుకు బదిలీ కాగా.. ఆయన స్థానంలో కొత్తగూడెం నుంచి పీ.వసంత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు.

April 11, 2026 / 06:45 AM IST

దొంగతనం కేసు ఛేదించిన సీఐకు పురస్కారం

NDL: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దొంగతనం కేసును ఛేదించిన ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణకు ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రతిభా పురస్కారం శుక్రవారం అందజేశారు. నిందితులను గుర్తించి స్వామివారి నగలను రికవరీ చేయడంపై ప్రశంసించారు. కేసులో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని కూడా అభినందించి అవార్డులు ప్రదానం చేశారు.

April 11, 2026 / 06:45 AM IST

గన్నవరం విమానాశ్రయాన్ని బైపాస్‌కు నేరుగా అనుసంధానం

కృష్ణా: విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు గన్నవరం విమానాశ్రయాన్ని బైపాస్‌కు నేరుగా అనుసంధానం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం చినఅవుటపల్లి, గొల్లపూడి మార్గాలే ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెదురుపావులూరు–కేసరపల్లి మార్గాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తే 20 నిమిషాల్లో చేరుకోవచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

April 11, 2026 / 06:45 AM IST

కేజీబీవీ ప్రవేశాల గడువు పొడిగింపు

ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 7 నుంచి 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

April 11, 2026 / 06:44 AM IST

బౌలర్ ఎవరైతే నాకేంటి?: వైభవ్

RCBపై వైభవ్ సూర్యవంశీ 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ.. తాను ఆడుతున్నప్పుడు బౌలింగ్ వేసేది ఎవరనేది చూడనని చెప్పాడు. బౌలర్ ఎవరైనా సరే తాను భయపడనన్నాడు. RR సపోర్టింగ్ స్టాఫ్ రోహిత్ తన మెంటార్ అని తెలిపాడు. తనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని, కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన తనకు చెబుతుంటారని అన్నాడు.

April 11, 2026 / 06:42 AM IST