AP: నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కొలగట్ల గ్రామం వద్ద లారీని తప్పించబోయి బస్సు పక్కకు పడింది. దీంతో ఐదుగురికి గాయాలు కాగా.. వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో శుక్రవారం తాగునీటి నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు నీటి కొరత రాకూడదని హెచ్చరించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు
MBNR: మూసాపేట్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని గుత్తేదారు సూచించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేశామని, రాత్రి వేళల్లో 60-70 కి.మీ వేగంతో కాకుండా నెమ్మదిగా ప్రయాణించాల్సిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
GDWL: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖర్చు లెక్కల సమస్యలు తలెత్తాయి. 298 మంది అభ్యర్ధులలో 74 మంది ఇంకా ఖర్చు వివరాలు సమర్పించలేదు. గద్వాల్, అయిజ్, అలంపూర్, వడ్డేపల్లి పరిధిలో లెక్కలు చెప్పకపోతే, వచ్చే ఎన్నికల్లో అనర్హత విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
HNK: హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత మాట్లాడుతూ.. జాగృతి విధానాలను ప్రజల్లోకి నేతలు విస్తృతంగా తీసుకెళ్లాలని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.
AKP: ప్రాజెక్ట్-17A కింద నిర్మించిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తారాగిరి’ శుక్రవారం నౌకాదళంలో చేరింది. శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండే టెక్నాలజీతో రూపొందిన ఈ నౌకలో బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు ఉన్నాయి. 75%కు పైగా స్వదేశీ భాగాలతో దీనిని ముంబైలో నిర్మించారు. అధునాతన రాడార్, సోనార్ సిస్టమ్‌లతో శత్రు కదలికలను ముందే గుర్తించగలదు.
NLG: సీఐడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌ను దేవరకొండలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఐడీ విచారణ పేరుతో వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని అన్నారు. అభివృద్ధి మరిచి అరెస్టులా అని అన్నారు.
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన ‘రాకాస’ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. కథ ముగింపులో ‘రాకాస 2’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించి అంచనాలు పెంచేశారు. ప్రస్తుతానికి షూటింగ్, కథాంశంపై స్పష్టత లేకపోయినా, ఈ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. =
VZM: రామతీర్థం గ్రామంలో మురుగు సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన వీధిలో చేపట్టిన రహదారి పనుల కారణంగా కాలువల్లో మట్టి చేరి నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాడుక నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల పెరుగుదలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
NDL: డోన్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో తేనెటీగల సమస్యపై శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలో తేనెటీగల తట్టును గుర్తించి ప్రత్యేక పద్ధతులతో జాగ్రత్తగా తొలగించారు. ఈ సమయంలో విద్యార్థులు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
CTR: పెద్దపంజాణి మండలం ఆరంజ్ జోన్‌లోకి వెళ్లింది. జిల్లాలో అత్యధికంగా ఆ మండలంలో శుక్రవారం 41.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 40.8, నగరిలో 40.1, శ్రీరంగరాజపురంలో 39.8, తవణంపల్లెలో 39.6, బంగారుపాళ్యంలో 39.0, పలమనేరులో 38.9, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాలలో 38.7, గంగవరంలో 38.6 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
గ్రౌండ్ ఏదైనా CSKను ఓడించడం కష్టమేనని ప్రత్యర్థి జట్లు భావించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. CSKని తన సొంత మైదానంలోనే ఓడించి పోతున్నాయి. పంజాబ్ చేతిలో ఓటమి సహా.. చెపాక్‌లో ఆడిన చివరి 6 మ్యాచుల్లోనూ CSK ఓడింది. గతేడాది తొలి పోరు మినహా అన్నీ ప్రత్యర్థి జట్లే గెలిచాయి. దీంతో చెన్నై తమ సొంత గ్రౌండ్ అని CSK మరిచిపోయిందా? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
SRPT: సాఫ్ట్వేర్ అప్డేడేట్ కారణంగా సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల వల్ల శుక్రవారం రాత్రి నుంచే ఈ అంతరాయం ఏర్పడింది. సుమారు 36 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా.. శని, ఆదివారాలు సెలవులు కావడంతో తిరిగి సోమవారం ఉదయం నుంచే సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో శుక్రవారం ఏవో కే. రాజు తనిఖీలు నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్చి 31 నుంచి పారాక్వాట్ నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మందు విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KMR: బాన్సువాడలో ఈ నెల 5న నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఆ సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. సంఘం డివిజన్ అధ్యక్షుడు దొబ్బల గంగాధర్ మాట్లాడుతూ.. పాత బాన్సువాడ నుంచి భారీ ర్యాలీ ఎత్తున ర్యాలీలతో కదలి వచ్చి మున్సిపాలిటీ వద్ద జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించనున్నాట్లు తెలిపారు.