TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 105.54 కిలోల గంజాయి పట్టుబడింది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 52,77,000 ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.