AP: గన్నవరం- షార్జా ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. దీంతో గన్నవరం ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులు, ఎయిరిండియా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. షార్జాలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. షార్జా వెళ్లాల్సిన 163 మంది ప్రయాణికులు ఆగిపోవాల్సి వచ్చింది.