TG: అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీల అభివృద్ధికి, వివిధ పథకాల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్నారని.. కానీ గత రెండేళ్లుగా కేవలం రూ. 10వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.