పిల్లల్లో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో రాగి జావ, కిస్మిస్లు, హలీమ్ గింజలు(అలివ్ సీడ్స్) ఎంతగానో సహాయపడుతాయి. వీటిని రోజూ ఏదో ఒక రూపంలో అందించడం మంచిది. అలాగే, ఐరన్ పుష్కలంగా ఉండే అటుకులను ఇవ్వడం వల్ల శరీరానికి ఐరన్‌తో పాటు తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. రక్త కణాల తయారీకి ఆకుకూరలు, నువ్వులు, వివిధ రకాలు పప్పులు, గుడ్లు చాలా ఉపయోగపడుతాయి.