AP: విజయవాడలో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వారిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. వీరితో సంబంధాలున్న మరో 10 మందిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.