AP: లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ‘తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు ఉన్నారు. వైఎస్ వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెపం నెట్టారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారు’ అని పేర్కొన్నారు.