స్ట్రాబెర్రీలు తక్కువ కేలరీలు, అధిక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగిన అద్భుతమైన పండ్లు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. బరువు తగ్గడంలో తోడ్పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు కొన్ని పండ్లు తింటే మెదడును చురుగ్గా ఉంచుతాయి. శరీరంలో వాపు తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.