AP: రైతు సంక్షేమమే లక్ష్యమని, అన్నదాతలు అప్పులపాలు కాకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ‘దీపం’ పథకం తెచ్చామని, ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ.. అనంతపురంలో ఎలక్ట్రానిక్స్ సిటీ ఏర్పాటుతో అభివృద్ధి వేగవంతం అవుతుందని, గత పాలనకు ఇప్పటికీ ఉన్న తేడాను గమనించాలని ఆయన కోరారు.