ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి-నర్సాపూర్ మధ్య ఈ రైలు సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు వీక్లీ రైళ్లను రెగ్యులర్ చేసింది. మరికొన్నింటిని పొడిగించింది.