AP: పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన విచారణ చేయిస్తున్నామని హోం మంత్రి అనిత వెల్లడించారు. డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ విచారణ చేస్తోందన్నారు. పారదర్శకంగా ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా మాత్రమే పరిగణించడంలేదన్నారు.