హైద్రాబాద్: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.అమరేందర్ రెడ్డి రెండో సారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బాపిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా పీవీ ధనలక్ష్మీ ఎన్నికయ్యారు. తనపై విశ్వాసంతో రెండోసారి అధ్యక్షుడిగా గెలిపించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యలపై నిరంతర పోరాటం చేసి అందుబాటులో ఉంటానన్నారు.