NLR: చేజర్ల మండల పరిధిలోని రేషన్ డీలర్లు, వీఆర్వోలతో తహసీల్దార్ బి.మురళి సమావేశం నిర్వహించారు. మండలంలో 29, 678 మంది రైస్ కార్డు సభ్యులు ఉన్నారని చెప్పారు. 27,395 మందికి గతంలోనే ఈకేవైసీ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం మండలంలో 2,940 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉండగా.. అందులో 1,112 మందే చేయించుకున్నారన్నారు.