HYD: పోలీస్ పత్రాలు అంటే ఇంగ్లీషు భాషలో ఉండడం సహజం. కానీ.. తెలుగు భాషలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసి పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప. ఇంగ్లీష్‌కు పరిమితమైన దర్యాప్తు, కోర్టు పత్రాలను సామాన్యులకు అర్థమయ్యేలా మాతృభాష తెలుగులో రూపొందించగా డీజీపీ శివధర్ రెడ్డి, DG శిఖా గోయల్ ఆమెను ప్రశంసించారు.