NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో బుధవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేసినప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు అన్ని హామీలను నెరవేరుస్తున్నామన్నారు.