KNR: హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఈ నెల 9న సురభి ఆసుపత్రి సౌజన్యంతో భారీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు చిగురుమామిడి కాంగ్రెస్ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.