TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ భవిష్యత్‌పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ లేదని, ఇలా చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీని పెట్టి నడించడం చాలా కష్టమన్నారు. బీఆర్ఎస్ పార్టీపై, ఆమె కుటుంబంపై కవిత చేసిన కామెంట్లు.. ఆమె పర్సనల్ అన్నారు.