ఢిల్లీలోని తుర్కమన్ గేట్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా.. కొందరు ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి, తమపై దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.