NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న సాంస్కృతిక భవనాన్ని వెంటనే అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం రూ. 13 లక్షలతో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని, దీనివల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భవనాన్ని ప్రజల అవసరాల కోసం వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.