TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఖరారైంది. రూ.5,800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది రోజున CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట-బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.