MDK: రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చెత్త సేకరణ వాహనాలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు బుధవారం ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.