VSP: నగరంలోని ఎంజీఎం (MGM) పార్కులో ఈ నెల 9, 10 తేదీలలో ‘లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0’ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ మరియు ఓడరేవుల శాఖ ప్రకటించింది. సముద్ర సంబంధిత వారసత్వాన్ని ప్రోత్సహించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యం చేస్తూ లైట్ హౌస్ టూరిజాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.