ADB: గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని MLA అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలం మార్కాగూడ గ్రామ నాయకులు, యువకులు MLA అనిల్ జాదవ్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.