యాషెస్ సిరీస్ చివరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ అద్భుత శతకం చేసి.. 142 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.