MDK: చైనా మాంజలను విక్రయిస్తే చర్యలు తప్పవని నిజాంపేట మండల ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేటలోని పలు దుకాణాలలో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గాలిపటాలు విక్రయించే దుకాణాదారులు చైనా మాంజల విక్రయించవద్దని ఈ చైనా మాంజా వల్ల మెడకు చుట్టుకొని ప్రాణాలు పోయే అవకాశం ఉందని, కాబట్టి దుకాణదారులు గమనించాలన్నారు.