TG: HYD ఉప్పల్ శిల్పారామం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ RTC బస్సులో అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత ఛార్జీల కంటే రూ.100 ఎక్కువగా వసూలు చేయడంతో ప్రయాణికులు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. RTC ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచడం అన్యాయమని, సమాచారం లేకుండా అదనపు డబ్బులు వసూలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.