SDPT: బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ పంచాయితీలో సర్పంచ్ ముక్కిస కవిత ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. కార్యదర్శి అనూష పాల్గొని గ్రామ సమస్యలను వినిపించారు. నల్లనీళ్లు, వీధి దీపాలు, సీసీ రోడ్లపై మట్టి కుప్పలు, ఇళ్ల ముందు మురికి కాలువల సమస్యలపై వార్డు సభ్యులు, గ్రామ ప్రజలతో చర్చించారు. ప్రజలు తెలిపిన సమస్యలను కార్యదర్శి అనూష నోటు చేసుకుని పరిష్కరిస్తామన్నారు.